నిన్నటి ఎపిసోడ్ లో గీతా ప్రవర్తన చూసి షాకైన నందు ఏమన్నాడో తెలుసా

bb

బిగ్ బాస్ రెండో సీజన్ ప్రారంభం అయ్యి రెండు నెలలు కావొస్తుంది. మొదట్లో కాస్త స్లో గా ఉన్నా రోజులు గడిచేకొద్ది కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. రెండు వారాలు గడిచాక రెండు రొమాంటిక్ స్టోరీలు నడిచాయి. ఆ స్టోరీలు విడిపోయాయి. ఇప్పుడు కొత్త లవ్ స్టోరీ బిగ్ బాస్ హౌస్ లో మొదలు అయ్యాయా అంటే కొన్ని వర్గాలు అవుననే అంటున్నాయి. కానీ అలాగేమి లేదు. అదే సామ్రాట్,గీత మాధురి గురించి. సామ్రాట్ తేజస్వి వెళ్ళిపోయాక ఒంటరి వాడు అయ్యాడు. ఆ తర్వాత ఎవరి జోలికి వెళ్లకుండా తన పనేమిటో తానే చూసుకుంటున్నాడు. ఈ మధ్య తన పర్సనల్ ఫ్యామిలీ పని మీద బయటకు వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి సామ్రాట్ లోన్లీ గా ఫీల్ అవుతున్నాడు.

bb geetha

ఏ టాస్క్ లోనైనా చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. బిగ్ బాస్ టాస్క్ లు ఇచ్చి మంచి ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నాడు. ఆలా టాస్క్ లో భాగంగా సామ్రాట్,గీతా మాధురి కళ్ళలో కళ్ళు పెట్టుకొనే గేమ్ ఆడుకున్నారు. ఆలా కళ్ళలోకి చూస్తూ సామ్రాట్ ని మాయ చేయటానికి ప్రయత్నం చేసింది. ఈ విషయంపై గీతా మాధురి భర్త నందు స్పందించారు.

గీతాలో ఇలాంటి క్వాలిటీస్ ఇప్పుడే చూస్తున్నా… నిజంగా గీతా ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుందా అని నాకే ఆశ్చర్యం కలిగింది. ఇది చూసిన వారు నెగిటివ్ గానే అనుకుంటారు. కానీ నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నాను. ఎందుకంటే గీతా యాక్ట్ చేస్తుంటే చాలా ముచ్చట వేస్తుంది. మొత్తానికి వీరి మధ్య ఏమి లేదని తేలిపోయింది